DREAMS in SLEEP by Dr. C. V. Rao
నిద్రలో కలలు పొంతన లేకుండా పరిపరి విధాల వస్తుంటాయి. వీటన్నింటికీ ఎటువంటి స్క్రీన్ ప్లే ఉండదు. సీక్వెన్స్ అసలే ఉండదు. ఎక్కువ సార్లు అదే పనిగా అనుకుంటే -ఆ రకమైన కల వస్తుందని కొందరు చెప్తారు. మన ఆపేక్షకు చెందిన avagation లు-అచేతన మనసు ద్వారా కలలో తారసపడుతూ కొంత awareness తీసుకొస్తాయేమో అనిపిస్తుంది. మనం గాఢ నిద్రలో ఉండగా ఒకానోక కలలో ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చినా వస్తుంది అరుదైన సందర్భాల్లో! యువతీ యువకులారా కలలు కనండి.! వాటిని సాకారం చేసుకోండి ! అని మన ప్రియతమ భారత మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం చెప్పిన సందేశం నేటి తరానికి బాగా కనెక్ట్ అయ్యిందని ఒప్పుకోవాలి. ఐతే,ఆయన చెప్పింది / నిద్రలో కలలు గురించి కాదు- సోయ లో ఉంటూనే , నీకు ప్రావీణ్యం ఉన్న జీవన గమనాన్ని శ్రద్ధగా ప్లాన్ చేసుకొని , తదనుగుణంగా స్వయం కృషి, పట్టుదలతో నీ భవిష్యత్తును నీవే తీర్చిదిద్దుకో .! అని దాని అంతరార్ధం. కలలు అనేవి వయసుకు అతీతమైనవి. ఈ కలలు in జనరల్ గా ఎన్ని రూపాలో వస్తుంటాయో కాస్త- విశ్లేషించుకుందాం. పగటి కలలు కంటున్నా మావయ్యా.. గాలి మేడలెన్ని నీవు కట్టావయా ! అన్నాడో సినీ గేయకవి 5- కలలు రావటానికి BASIC REASONS ఏమిటి? అనేది అసలు ప్రశ్న కల అనేది రాకుండా నియంత్రించే ఉపాయం ఏదైనా ఉందా ? అని చిక్కు ప్రశ్న. “ఎలాంటి Conflicts నాకు లేవు గనుక ; నాకు కలలు రావు” అతి తక్కువ మంది అంటుంటారు. బహుశా ! ఆ దశకు ఇప్పటి ఆధ్యాత్మిక వేత్తలు గాని/ తత్వవేత్తలు గాని ఎవ్వరూ చేరలేదేమో అనిపిస్తుంది.👌 6- నిండుగా మద్యం త్రాగి నిద్ర పోయే వారిని కొంత మందిని interrogation చేశాను. రాత్రంతా కల అనేది రాకుండా ఉన్నదా ? మంచి నిద్ర కోసమేనా మీరు full bottle కొడుతున్నది ? అని. వాళ్ళ రిప్లై ఏమిటంటే- “మేము సరిపడా కిక్ కోసం కాస్త ఎక్కువే త్రాగుతున్నాము. ఏ తెల్లవారు జాము కో, త్రాగిన కిక్కు తగ్గిపోయినప్పుడు / కొన్ని కలలు ఎంటర్ కావటం మాత్రం గమనించాము. అవేమీ ఆగలేదు” అన్నారు. 7- ఐతే, మనం నిద్రలో కంటున్న కల కంటిన్యూ అవుతుండగా / ఏదైనా బాడీ need urgent అనిపిస్తే, మన subconscious mind నుండి తగిన సంకేతం వస్తుంది. నిద్రిస్తున్న దేహానికి దాహం బాగా అనిపించినపుడు మనం నీళ్లు త్రాగినట్లు కలలో తెలియని అనుభూతి కలుగుతుంది. వాస్తవానికి మనం నీరు త్రాగ లేదు గనుక; ఆ దావాద్రిని భౌతికంగా తీర్చేందుకు మనలోని subconscious mind మనల్ని కల నుండి-మెళకువకు రప్పిస్తుంది. కొన్ని సార్లు ఆ కల తాలూకు కథను continue చేస్తూనే URGENCY దారివైపు దానిని మళ్ళిస్తుంది. నిద్ర మధ్యలో లేచి వాష్ రూమ్ కు వెళ్లే పరిస్థితి కూడా ఇందులో భాగమే ! ఇది దాదాపు పెద్దవాళందరికీ అనుభవమే. ! 8- అజీర్ణంతో ఇబ్బందిలో ఉండగా నిద్రలో కల వస్తుంది. గమనిస్తే ఆ కలలో కొంత అలజడి తొలుస్తుంది. ఇది నెగటివ్ స్పందన అనుకుందాం. మనం గాఢ నిద్రలో ఉండగా ఒకానోక కలలో ఒక spork లాంటి ఐడియా వస్తుంది. అది నీ వెతుకులాటకు సంబంధించింది కావటం ఇంకో విశేషం! ఉదా :కు = నేనొక బుక్ ను రచన చేస్తున్న TIME లో -దాని కాప్షన్ కోసం నేను, మా ఎడిటర్ 3 రోజులుగా మల్లగుల్లాలు పడ్డాం. 4 వ రోజు నాకు వచ్చిన కలలో దాని కాప్షన్ -వాక్యం ఒక మెరుపు మెరిసింది… అప్పటికి అది -రాత్రి 2-30 am. స్వధర్మయోగం-బుక్ టైటిల్ కు కాప్షన్ “ అనువైన వృత్తిలో ఎనలేని ఆనందం” అని. అప్పటికప్పుడు వెంటనే వ్రాసుకొని/ తెల్లవారగానే ఎడిటర్ గారికి SMS చేశాను . భేష్ అన్నారు. ఇలా కలలో సయితం మన subconscious mind మనల్ని డ్రైవ్ చేసి, అరుదైన సందర్భాలలో మెరుపు లాంటి పరిష్కారం కూడా చూపవచ్చు ! అని నా స్వానుభవం. 9-నిద్రలో మనకు నచ్చిన కలల్ని మనమే ఎంచుకోవచ్చా? మలుచుకోవచ్చా ? అని invention చెయ్యాలని 12సం.క్రితం ఒక ఐడియా వచ్చింది. ఒక 2 వారాల పాటు / నేను నిద్రిస్తుండగా రాత్రంతా LOW SOUND లో F.M. రేడియో పాటలు పెట్టుకొని విన్నాను. ఈయనకు ఆడియో పిచ్చి తలకెక్కింది అని ఇంట్లో వాళ్ళు నన్ను కొన్నాళ్ళు వెలి వేశారు కూడా. ఒక ప్రక్క నా నిద్ర సాఫీగా సాగుతున్నది. అందులోనాకు connect ఐన పాటలు మానసికంగా కలలో తారసిల్లటం/ హృదయం కూడా SPONTANEOUS గా అనుభూతి చెందటం అనేది అలవోకగా నేను గమనించాను. 10- మన భయాలు, రాగ ద్వేషాలు, అభద్రతా భావాలు, లాంటివి ఎన్నెన్నో అచేతన మనస్సులో నిగూఢంగా పేర్చబడి ఉంటాయి. అవి అప్రేమేయంగా కలలలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ మానసిక KLESHAALU మీద ఎప్పుడు వ్యక్తికీ నిజమైన సోయ వస్తుందో, అప్పుడు దాని వెంపర్లాట తగ్గి, సంతృప్తికరమైన నిద్రను అనుభవంలోకి తెచ్చుకొన గలడు. ఏ రోజు కర్మలు ఆరోజు సలక్షణంగా నిర్వర్తించే ఏ వ్యక్తికైనా ఆత్మసంతృప్తి సాక్షిగా మంచి నిద్ర పట్టే వీలుంది. అయితే ఇవన్నీ కేవలం Dream విషయంలో JK చెప్పిన CLEAR CUT పాయింట్ ఒకటి ఇక్కడ మనం ప్రస్తావించుకుందాం. “THE DREAMER PERPETUATES HIS OWN LIMITATION; THEREFORE, THE DREAM IS ALWAYS THE EXPRESSION OF THE INCOMPLETE, NEVER THE WHOLE” 10- అవును, ఇది ముమ్మాటికీ నిజo. ఏ కల ఐనా కూడా / CUT చేస్తే… అన్నట్లు / పొంతన లేని మరొక దృశ్యానికి వెళ్తుంది…కానీ ఒక కథగా ముగింపునివ్వదు! 11-అసలు కలల్ని ఎవ్వరూ కట్టడి చేయలేరండీ. నిద్రలో ఆల్ఫా,తీట, డెల్టా స్టేజీలు అనేవి ప్రతి 90 సెకండ్లకు ఒక సైకిల్ mode లో సాగుతుంటాయి. ఒకవేళ మంచి కల గనుక వస్తే-”అదే నిజమైతే ఇంకెంత బాగుండు” అని ఎవరైనా వాపోతారు. సరే, పలు రకాల కలలు మనం కంటున్నా, లేక వింటున్నాది ! ఉదా : నేను వ్రాసిన 2020 లో రచించిన “ స్వధర్మయోగం” పుస్తకానికి సరైన కాప్షన్ కోసం 3 రోజులు నేను, ఎడిటర్ వెతుకులాటలో ఉన్నాం. మనసు అదే పరంపరలో ఉంది గనుక నెమో నిద్రలో వచ్చిన కలలో “ అనువైన వృత్తిలో ఎనలేని ఆనందం” ఓ కొత్త caption మెరిసింది.కల గన్న సంగతులు మనం సహజంగా మర్చిపోతుంటాము. అందుకే తటాలున లేచి caption నోట్ చేసుకున్నాను. అందరూ ఒప్పుకునే వాస్తవం ఏమిటంటే మనం కలలో involve అయి ఉన్నప్పుడు అచేతన మనస్సు మన శరీర నాడీ మండల వ్యవస్థను కొంత ప్రభావితం చేస్తుంది అని మెడికల్ సైన్స్ చెబుతున్నది. DREAM లో అది నిజంగానే LIVE లో జరుగుతున్నట్లు తప్ప -ఇది కేవలం కల -అని ఒక్క క్షణం కూడా మనకు తోచదు.! అనేది పరమ సత్యం. 12- కన్న కలల ఆశయాలు అన్నీ నిజం-కావొచ్చు-లేదా కాలేక పోవచ్చు అనేది అర్ధ సత్యం. నిజాలు మీద ఆధారపడి ముందుకు సాగే వారికి కలలతో అవసరమే లేదు అనేది పూర్ణ సత్యం.!
DREAMS in SLEEP by Dr. C. V. Rao Read More »

